
సినిమా అనేది “మేక్ బిలీవ్ ” ప్రక్రియ ,ఆడియన్స్ లాజిక్ జోలికి వెళ్లకుండా వాళ్ళను ఒప్పించగలిగితే అదే విజయవంతం అయినా సినిమా. ఆడియన్స్ లాజిక్స్ పట్టించుకుంటరా? వాళ్ళను లాజిక్ గురించి ఆలోచించకుండా చేయడమే దర్శకుడి ప్రతిభ.”లాజిక్ ఎక్కడ మొదలు అవుతుందో అక్కడ డ్రామా ఆగిపోతింది” ఇది డైరెక్టర్ పాటించ వలసిన ఫస్ట్ కామండ్మెంట్. డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేసిన “పదహారేళ్ళ వయసు” సినిమా లో క్లైమాక్ సీన్ లో చంద్రమోహన్ గారు శ్రీదేవి గారికి తాళి కట్టే సీన్ లో ఆకాశం అంతా రంగు మారి ఎర్రగా కనిపిస్తుంది, ఆ షాట్ చెప్పగానే కెమెరామ్యాన్ ప్రకాష్ గారు ఆకాశం ఎర్రగా మారటం ఏమిటండి, మెయిన్ కెమరామెన్ విన్సన్ట్ గారు చూశారంటే నన్ను వాయిస్తారు అని సందేహించారట. కానీ రాఘవేంద్ర రావు గారు ఫోర్స్ చేసి మరి తాను అనుకున్నట్లు గానే తీశారు, ఆ సీన్ రీరికార్డింగ్ అయి రిలీజ్ అయినా తరువాత ఆడియన్స్ లాజిక్ జోలీ కి వేళ్ళ లేదు, ఎందుకంటే శ్రీదేవి, చంద్రమోహన్ కలసి పోయారు అనే ఆనందం, వాళ్ళు ఆకాశం ఎందుకు ఎర్రగా అయింది అని ఆలోచించ లేదు. దర్శకుడు వారిద్దరి కలయికతో ప్రకృతి కూడా పరవశించింది అని బలంగా నమ్మించ కలిగారు, అదే మేక్ బిలీవ్ అంటే.

