in

location spot fixed for pushpa!

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్ కి ముందు బన్నీ లేని కొన్ని సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించారు. ఇక బన్నీ కూడా షూట్ లో జాయిన్ అవుతాడనుకుంటున్న తరుణంలో లాక్ డౌన్ వచ్చింది. దాంతో ఇక కేరళ అడవులను వదిలేసి మహబూబ్ నగర్ అడవుల్లో షూటింగ్ చేద్దామని ఇటీవల ప్లాన్ చేశారు కూడా. అయితే తాజాగా ఆ ఆలోచనను విరమించుకుని, తాము కోరుకున్న లొకేషన్లు వుండే కేరళకే వెళ్లాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది..

i have not received any summons : rakul

rashmika mandhanna in vijay’s private party!