ఇప్పుడు ఆమె కెరీర్ బాగా స్లో అయిపోయింది. తండ్రితో కలిసి ఏదో ఒక సినిమా చేస్తున్నప్పటికీ దానికి అంతగా క్రేజ్ లేదు. ఐతే తాను హాలీవుడ్లో ఉంటే కథ వేరుగా ఉండేది అంటోంది లక్ష్మి. తన హాలీవుడ్ కెరీర్ మధ్యలో ఆగిపోవడంపై ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. హాలీవుడ్లో ఉంటే మీ కెరీర్ మరోలా ఉండేదేమో కదా అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి బదులిస్తూ.. ‘‘నేను హాలీవుడ్లో ఒక సిరీస్, సినిమా చేసి వదిలేయలేదు. నేను హాలీవుడ్ యాక్టర్‌ని.
నా దురదృష్టం కొద్దీ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చా. ఈ పదేళ్లు అక్కడ ఉండుంటే నేను ఎక్కడో ఉండేదాన్ని. పాప కావాలి అనుకున్నపుడు ఇండియాకు వచ్చేయాలని డిసైడయ్యా. పిల్లల విషయంలో ఇక్కడున్న కంఫర్ట్, కేరింగ్ ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు పాపకు రెక్కలొచ్చాయి. మాక్కూడా రెక్కలొచ్చాయి. అందుకే వేరే అవకాశాల కోసం చూస్తున్నాం. మళ్లీ విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా ఫ్లైట్ ఎక్కేశా’’ అని తెలిపింది..!!