in

Kushboo Bold Comments On Megastar Chiranjeevi!

మెగాస్టార్‌ తో రొమాన్స్ చేయాలని ఉంది అంటూ బొల్డ్ కామెంట్స్ చేసింది సీనియర్ నటి ఖుష్బూ. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటస్ట్ మూవీ రామబాణం. ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా.. మెగాస్టార్‌ తో  రొమాన్స్‌ చేయాలన్న తన కోర్కెను బయటపెట్టింది ఖుష్బు.” చిరు నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది..ఆయన ఒక లెజెండ్‌. మానవత్వం కలిగిన వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది. చేసే పని మీద ఫ్యాషన్‌ కూడా ఎక్కువే. ఆయన ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అంతేకాదు నేను మెగాస్టార్ ను కదా ఏం చేసినా జనాలు చూస్తారని అనుకోరు. కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు’’ అని అన్నారు ఖుష్బూ.

Vijay Devarakonda And Sreeleela’s New Movie Launched Today!

AR Rahman onboard for Ram Charan’s next!