
డాక్టర్ అవ్వాలి అనుకోని యాక్టర్ అయ్యాను అని చెపుతారు కొంతమంది, యాక్టర్ అవ్వాలి అనే కష్టపడి యాక్టర్ అయ్యాను అని చెపుతారు, అనుకోకుండా యాక్టర్ అయినా వారు ఉంటారు, ఇప్పుడయితే వారసత్వంగా కూడా యాక్టర్లు అవుతున్న ఈ రోజుల్లో, కారు కొనుక్కోవటం కోసం యాక్టర్ అయ్యాను అని చెపుతున్న సుందరి ఎవరో తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్ అండీ.యాక్టర్ అవటం జీవిత ఆశయం వంటి కధలు చెప్పకుండా తాను, ఎందుకు, ఎలా నటి అయ్యారో చెప్పేసారు. 19 ఇయర్స్ ఏజ్ లోనే కన్నడ చిత్రం గిల్లీ లో అవకాశం వచ్చింది, నటన గురించి ఏమి తెలియకపోయిన నటించేసారు, ఆ సినిమా కేవలం తన పాకెట్ మనీ కోసం చేశాను అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు రకుల్ గారు. ఆ రోజుల్లో కారు కొనుక్కోవాలి అని సరదా ఉండేదట తన ఫ్రెండ్స్ సర్కిల్ లో తనదే మొదటి కారు ఉండాలని, అది కూడా,తన సొంత సంపాదనతో కొనాలి అనుకోని, గిల్లీ సినిమా ఒప్పుకొన్నారట. కానీ ఆ తరువాత, తన వృత్తిని సీరియస్ గ తీసుకొని మంచి నటిగా ఎస్టాబ్లిష్ అయ్యారు.

