in

KTR calls Sonu Sood As A Super Hero And Applauds him!

నకు దక్కిన సాయానికి కృతజ్ఞతగా నందకిషోర్ అనే వ్యక్తి ట్విట్టర్​లో ఒక పోస్ట్ పెట్టాడు. ​ఆక్సిజన్ కాన్​సన్ట్రే​టర్​ను అడగ్గానే.. అందేలా చూసినందుకు థ్యాంక్స్​తో సరిపెట్టలేనని ఆ వ్యక్తి పోస్టు చేశాడు. అడిగిన వెంటనే సాయం అందించనందుకు కృతజ్ఞతలని, తెలంగాణ ప్రజలకు మీతరపున అందుతున్న సాయం మరువలేనిదని, చివరగా మీరు సూపర్​ హీరో అని చెప్పాలనుకుంటున్నానని నందకిషోర్ KTR కు​ ట్వీట్ చేశాడు. దానికి ప్రతిగా కేటీఆర్​ స్పందిస్తూ..

ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా తోచిన సాయం మాత్రమే చేశాను బ్రదర్​.. మీరు సోనూసూద్​ను(ట్యాగ్ చేసి మరీ) సూపర్​ హీరో అనడం కరెక్ట్​. ఆపదలో ఉన్నవాళ్లు మీరు సాయం అందించండి అని ఆ వ్యక్తికి సూచించాడు. కేటీఆర్​ రిప్లైకి సోనూసూద్ కూడా స్పందించారు. ‘థ్యాంక్​ యూ సో మచ్​ సర్. కానీ, తెలంగాణకు మీరు ఎంతో చేస్తున్నారు. కాబట్టి మీరే రియల్​ హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ నాకు మరో ఇంటిలాంటిది. ఏళ్లుగా ఇక్కడి జనాలు నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అని సోనూసూద్​  రీ ట్వీట్​ చేశారు.

Missed Chance With Venky twice, says Priyamani!

rakul and shruthi haasan rejects balakrishna’s next?