ఏఐ టెక్నాలజీ, డీప్ ఫేక్ వీడియోల గురించి హీరోయిన్ కృతి సనన్ స్పందించారు. తాజాగా ఆమె నటించిన ‘తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా’ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్ గురించి మాట్లాడారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. కొన్ని నెలల నుంచి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి..
డీప్‌ఫేక్‌ల విషయంలో టెక్నాలజీని నిందించడం తప్పు. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏఐని సృష్టించింది కూడా మనుషులే అనే విషయం గుర్తుంచుకోవాలి. టెక్నాలజీ అభివృద్ధి చూస్తుంటే.. భవిష్యత్తులో ఏఐ మన భాగస్వామి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు’..మన ఫొటోలు అలా చూసుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించుకోలేను. ఇలాంటి మరోసారి జరగకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టాలు కావాలి’ అని అన్నారు..!!