తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనలా కొడుకు మహేష్ బాబు కూడా మంచి స్థాయికి ఎదగాలని సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎంతో కోరిక ఉండేదట..సూపర్ స్టార్ కడుపున సూపర్ స్టార్ ఏ పుడతాడు అనే మాటను మహేష్ నిజం చేశాడన్న సంగతి ఇప్పుడు అందరకీ తెలిసిన విషయమే..అయితే తండ్రి కోరికను తీర్చాలని కంకణం కట్టుకున్న మహేష్ బాబు, కృష గారి వాళ్ళ చిన్నప్పుడు ఒక సంవత్సరం స్కూల్ ను మిస్ అవ్వాల్సి వచ్చింది..ఎందుకో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి..చిన్నప్పుడు మహేష్ బాబు తో హాలిడేస్ అప్పుడు సినిమాలు చేయించేవారట కృష గారు..ఏప్రిల్, మే, నెలలో ఊటీ కు వెళ్లి సినిమాలు చేసేవారట .. ఇలా దాదాపు ఆరేడు సంవత్సరాలు ప్రతి ఏటా ఊటీ కు వెళ్లి ఆరు సినిమాల్లో నటించారు చిన్నప్పుడు మహేష్ బాబు.
అయితే ఒక సినిమా షూటింగ్ మాత్రం ఏప్రిల్, మే కాకుండా జూన్ జులై వరకు వెళ్ళిందంట. అలా ఆ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఆ ఏడాది స్కూల్ పోవడానికి వీలు కాలేదట..దింతో మహేష్ కు స్కూల్ లో ఒక ఇయర్ పోయింది..తన వల్ల కొడుకు జీవితంలో ఒక ఇయర్ వేస్ట్ అయ్యిందని ఎంతో బాధ పడ్డారు కృష్ణ గారు. దాంతో మహేష్ బాబు ను కూర్చోబెట్టి.. ఇంక ఇదంతా ఇప్పుడే వద్దు, నువ్వు ముందు చదువంతా పూర్తి చేయి, ఆ తరువాత సినిమాల్లో హీరోగా చేద్దువులే అని అన్నారట. కృష్ణ గారి మాట విన్న మహేష్ అలాగే చదువంతా పూర్తి అయ్యేవరకు సినిమాలకు దూరంగా ఉండి, చదువు పూర్తయ్యాక మళ్ళి వచ్చి హీరోగా చేశారట.. అలా ఆరోజు హీరో గ మళ్లీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తీరిగి వెనుకకు చూడకుండా ఈరోజు ఈ స్థాయి కు చేరుకున్నారు.