NTR కృష్ణ కలసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ” దేవుడు చేసిన మనుషులు”, కృష్ణ గారి మీద కోపం తో మొదట ఈ సినిమా లో నటించను అని చెప్పి రిజెక్ట్ చేసారు యెన్.టి.ఆర్. అసలు ఎందుకు నటించను అని చెప్పారు, కృష్ణ గారి మీద కోపం రావటానికి కారణం ఏమిటి? ఆ తరువాత మళ్ళీ యెన్.టి.ఆర్. ఎందుకు ఆ చిత్రం లో నటించారు? పండంటి కాపురం 100 డేస్ ఫంక్షన్ లో స్టేజి మీద కృష్ణ గారు రిక్వెస్ట్ చేయటం తో, ఎస్ చెప్పిన యెన్.టి.ఆర్. కృష్ణ తో కలసి ఒక చిత్రం నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతలో అప్పట్లో జరుగుతున్న జై ఆంధ్ర మూవ్మెంట్ కి మద్దతుగా కృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చూసిన యెన్.టి.ఆర్. కోపం తో ఊగిపోయారు..
అప్పటికే హైదరాబాద్ లో ప్రాపర్టీస్ ఉన్న ఏ.యెన్.ఆర్. యెన్.టి.ఆర్. తటస్థంగా ఉండటం, వీరిని సంప్రదించకుండా కృష్ణ గారు” ప్రత్యేక ఆంధ్ర” కు మద్దతు గ స్టేట్మెంట్ ఇవ్వటం యెన్.టి.ఆర్. కు నచ్చలేదు. యెన్.టి.ఆర్. కోపం గ ఉన్నారని తెలుసుకొని ఆయనను కలవటానికి వెళ్లిన కృష్ణ తో కాస్త కఠినం గ మాట్లాడిన యెన్.టి.ఆర్. మీ సినిమా మేము చేయటం లేదు అనిచెప్పి పంపేశారు..ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే హరికృష్ణ గారి పెళ్లి నిమ్మకూరు లో జరగటం, యెన్.టి.ఆర్. కృష్ణ గారిని ఆహ్వానించటం జరిగింది, ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న స్ట్రైక్ కారణంగా ట్రైన్స్, బస్సులు లేకపోవటం తో చాల మంది ఆ వివాహానికి హాజరు కాలేక పోయారు.
కానీ కృష్ణ గారు పాత విషయాలు ఏమి మనసులో పెట్టుకోకుండా, విజయ నిర్మల సమేతంగా నిమ్మకూరు లో జరిగిన హరికృష్ణ వివాహానికి హాజరు అయ్యారు. యెన్.టి.ఆర్. కృష్ణ దంపతులను సాదరంగా ఆహ్వానించి ,స్వయం గ దగ్గర ఉండి మర్యాదలు చేసారు. వివాహం తరువాత తిరిగి మద్రాసు చేరుకున్న యెన్.టి.ఆర్. కృష్ణ గారికి ఫోన్ చేసి బ్రదర్ మనం సినిమా చేస్తున్నాము, షూటింగ్ ప్లాన్ చేసుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, వెంటనే కృష్ణ గారు అప్రమత్తం అయి షూటింగ్ కు కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ విధంగా ఆగిపోయింది అనుకున్న”దేవుడు చేసిన మనుషులు” సినిమా మళ్ళీ మొదలయి, బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచింది.