in

Allu Arjun to lock horns with Sunil Shetty in pushpa 2?

కాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్, సామ్ గ్లామర్, రష్మిక అభినయం, దేవిశ్రీ సంగీతం… సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. బన్నీ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనిపించినా “పుష్ప” చిత్రం సీక్వెల్ “పుష్ప : ది రూల్” పేరుతో రూపొందనుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో “పుష్ప”కు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.

ఇక తాజాగా సెట్స్ పైకి వెళ్లనున్న “పుష్ప-2” కోసం మేకర్స్ బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దింపబోతున్నారట. ఇంతకుముందు పార్ట్ లో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కన్పించారు. కానీ బాలీవుడ్ నుంచి ఎవరూ కన్పించలేదు. అయినప్పటికీ ఈ చిత్రంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపింది. దీంతో పార్ట్ 2లో మేకర్స్ బీటౌన్ నుంచి ఒక నటుడిని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా, భన్వర్ సింగ్ షెకావత్ కు పై అధికారికంగా కన్పించబోతున్నారట. స్మగ్లింగ్ సిండికేట్ కింగ్ పుష్పకు, భన్వర్ లాల్ కు మధ్య జరిగే పోరాటంలో సునీల్ శెట్టి పాత్ర అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుందని అంటున్నారు. మరి సునీల్ శెట్టి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతమేరకు దగ్గర అవుతారో చూడాలి.

KRISHNA GARI MEEDA KOPAM THO CINEMA REJECT CHESINA N.T.R!

Avika Gor to make her Bollywood debut with Vikram Bhatt’s movie!