తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వారసుడు సినిమా చేశాడు. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని కూడా మరో తెలుగు డైరెక్టర్‌తో చేసేందుకు విజయ్ అంగీకారం తెలిపాడు. నందమూరి బాలకృష్ణకు ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో విజయ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించబోతుంది. ఇప్పటికే గోపీచంద్ చెప్పిన కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓ పవర్ ఫుల్ పోలీస్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలోనే ఇవ్వనున్నారు..!!
young director to repeat uppena combo again!
ఉప్పెన’ సినిమాలో ‘బేబమ్మ, ఆసు’ పాత్రలతో ఆకట్టుకున్న జంట వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. ఆకట్టుకున్నారనడం కంటే, ఆ పాత్రల్లో జీవించేశారనడం అతిశయోక్తి కాదేమో. అంతలా ఆ పాత్రలతో కట్టిపడేశారీ జంట. ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో కృతి శెట్టి వరుసగా సినిమాల మీద సినిమాలు ఓ కే చేసేసి బిజీ అయిపోయింది. వైష్ణవ్ తేజ్ అయితే, ఆచి తూచి విభిన్నమైన కథలతో హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. ఇప్పటికి మూడు (ఉప్పెన, కొండపొలం, రంగ రంగ వైభవంగా) సినిమాలు పూర్తి చేసిన వైష్ణవ్ తేజ్..
ప్రస్తుతం మరో రెండు డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధంగా వున్నాడు. కాగా, తాజా సమాచారం ప్రకారం, తొలి సినిమా కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోందనీ తెలుస్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో ఫేమస్ అయిన ఈ జంట మరోసారి ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కి సై అంటున్నారట. ఓ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించబోయే సినిమాలో ఈ జంట నటించబోతోందట. మోడ్రన్ లవ్ స్టోరీగా రూపొందబోయే ఈ సినిమాని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతోందనీ సమాచారం. ఎక్కువ భాగం విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరగనుందట..!!