
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బి[/qodef_dropcaps] గ్ బాస్ తెలుగు సీసన్ 3 మొత్తానికి మొన్న గడిచిన ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్ కి చెందిన సింగర్ రాహుల్ సిప్లిగూంజ్ టైటిల్ విజేతగా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ తన సొంతం చేసుకున్నాడు. అయితే బిగ్ బాస్ 3 అయిపోవడంతో ఇప్పుడు అందరి మదిలో ఒక కామన్ ప్రశ్న ఉంది.. అదేంటంటే హోస్ట్ గ చేసిన టాలీవుడ్ మన్మధుడు బిగ్ బాస్ నుండి తీసుకున్న పారితోషకం ఎంత ? హోస్ట్ గ వారానికి రెండు సార్లు వీకెండ్ లో కనిపించి సందడి చేసిన నాగ్ ప్రతి వారానికి 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీన్నిబట్టే చుస్తే మొత్తం 30 కి పైగా ఈ సీసన్ లొ ఎపిసోడ్స్ చేసిన నాగ్ అందుకున్న రెమ్యూనరేషన్ 70 కోట్లు పైమాటే. మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలీదు కానీ గత సీసన్స్ హోస్టస్ ఎన్టీఆర్ ఇంక నానితొ పోలిస్తే నాగ్ కచ్చితంగా వాళ్ళకంటే చాల ఎక్కువ మోతాదులో పారితోషకం తీసుకున్న మాట మాత్రం నిజం.