in

Kiara advani’s bikini scenes trimmed in war 2!

టి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది తెలుగు, హిందీలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ చిన్నది తాజాగా “వార్-2” సినిమాలో నటిస్తోంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కియారా అద్వానికి సంబంధించిన కొన్ని బికినీ సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించినట్లుగా సమాచారం అందుతుంది. కియారా బికినీ ధరించి కనిపించిన సన్నివేశాలను తీసివేసినట్లుగా సినీ వర్గ సభ్యులు వెల్లడించారు..

అయితే సినిమాలో ఎంత నిడివి తొలగించారనే విషయంపై క్లారిటీ లేదని స్పష్టం చేశారు .ఇప్పటికే ఈ సన్నివేశాలతో కూడిన ఊపిరి ఊయలగా వీడియో సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ చూసిన అనంతరం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి..!!

south Actor Apologizes to Tamannaah over his behavior!