in

Kiara Advani to be part of Prabhas’ salaar 2?

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్ పార్ట్- 1’ బ్లాక్బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తొలి భాగానికి కొనసాగింపుగా ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

సలార్ పార్ట్-2లో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోందట. బీ టౌన్ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందట. రెండో పార్ట్లో ఆమె ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు సమాచారం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కియారాతో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. అయితే పార్ట్-2లో కియారా పాత్ర సెంకడ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తుందని టాక్. ప్రభాస్- కియారా జోడీ బిగ్ స్క్రీన్పై సందడి చేస్తుంటే క్రేజీగా ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!

ranveer singh wants to act under ss rajamouli’s direction!

Sreeleela’s super Entry into Kollywood with Ajith!