మిల్క్ బ్యూటీకి ఈ మధ్య ఎదురుదెబ్బలు తగులుతున్నాయ్. జెమినీలో తను హోస్ట్ చేస్తున్న కార్యక్రమం నుంచి తీసేయడం.. దానిపై ఆమె న్యాయ పోరాటానికి కూడా దిగింది. తాజాగా మరో షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవి మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో తమన్నాకు రూ. కోటిన్నర పారితోషకం ఇచ్చినట్టు సమాచారం. ఇక్కడ వరకూ బాగానే ఉంది.
ఇక్కడే ఉంది అసలైన ట్విస్టు. ఇదే సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోన్న కిర్తీ సురేష్‌కు రెండు కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. హీరోయిన్గా నటిస్తోన్న తమన్నా కంటే కీర్తి సురేష్‌కు ఎక్కువ పారితోషకం ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి.. తమన్నాకు రెమ్యునరేషన్ విషయంలో అన్యాయం చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. భోళా శంకర్ ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అనిల్ సుంకరతో కలిసి కే.యస్.రామారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు విభిన్నమైన లుక్‌లో అంటే గుండుతో కనిపించనున్నారు.