in

keerthy suresh: i am not single

కీర్తి సురేష్ ఇప్పుడు స్టార్ హీరోల ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టించ‌డ‌మే కాకుండా అప్పుడ‌ప్పుడు లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లో కూడా న‌టిస్తూ అల‌రిస్తూ ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య కీర్తి సురేష్ ప్రేమ‌, పెళ్లికి సంబంధించి ఎక్కువ‌గా రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. తాజాగా ఆ రూమ‌ర్స్‌పై కీర్తి సురేష్‌ స్పందించారు. కెరీర్ బిగినింగ్ లో నాకు వరుసగా పరాజయాలు ఎదురుకావ‌డంతో నన్ను బాగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ బాధకు గురి చేశాయి. మహానటి విజయం తర్వాత ట్రోల్స్ తగ్గాయి కాని కొందరు కావాలనే నాపై పుకార్లు పుట్టించారు.

నెగిటివిటీని నేను పట్టించుకోను. కాలమే వాటికి సమాధానం చెబుతుందంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది..అయితే ఓ రిపోర్ట‌ర్ మీరు సింగిల్ క‌దా, లైఫ్ బోర్ కొట్ట‌డం లేదా అని ప్ర‌శ్నించ‌గా దానికి కీర్తి సురేష్ నేను సింగిల్ అని ఎవ‌రు చెప్పారంటూ తిరిగి ప్ర‌శ్న వేసింది. దీంతో అంద‌రు షాక్ అయ్యారు. ఇక పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియ‌జేసింది కీర్తి సురేష్‌. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహనే వివాహం అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అయితే కీర్తి సురేష్ తాను సింగిల్ కాదంటూ చెప్పుకురాగా మ‌రి త‌న మ‌న‌సులో ఉన్న ఆ ల‌క్కీ ఫెల్లో ఎవ‌రో అని జ‌నాలు తెగ ముచ్చ‌టించుకుంటున్నారు..!!

a secret bond between sreeleela and rashmika mandanna!

ravi teja’s heroine Bhagyashri Borse never gets late!