in

Keerthy Suresh Breaks Silence On Equal remunerations!

తాజాగా కీర్తి సురేష్ కూడా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడింది. కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఈ సినిమా జులై 4 న నేరుగా అమెజాన్ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కీర్తి సురేష్. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈక్వల్ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెమ్యునరేషన్ అనేది మహిళలు, మగవాళ్లకు సంబంధించింది కాదు. ఇందులోకి ఈక్వాలిటీ తీసుకురావడం అనేది నాకు అర్ధం కాదు..

ఒక మేల్ యాక్టర్ థియేటర్ కి జనాల్ని ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో, అలా ఒక ఫీమేల్ యాక్టర్ కి కూడా ఉందంటే ఇవ్వవచ్చు. ఒక ఫిమేల్ యాక్టర్ కి జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వవచ్చు. ఈ హీరోయిన్ తో సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, పెద్ద కలెక్షన్ వస్తాయి అని నమ్మితే ఇవ్వవచ్చు. హీరోకి ఇంత ఇస్తారు, హీరోయిన్ కి ఇంత ఇవ్వలేదు అనేది కాదు. హీరోలాగా ఫిమేల్ యాక్టర్ కూడా జనాల్ని థియేటర్స్ కి తీసుకొస్తే ఇవ్వవచ్చు. హీరోలకు ఇస్తారంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్, చాలా మంది వస్తారు కాబట్టి ఇస్తారు అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్..!!

happy birthday vijaya shanthi!

Nani to team up again with ‘Hi Nanna’ director Shouryuv again!