సౌమ్యుడు, నాన్ కాంట్రవర్షియల్ నటుడు దగ్గుబాటి వెంకటేష్ గారికి ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ ఇవ్వకుండా నిర్మాతల మండలిలో పంచాయితీ వరకు వెళ్లిన నిర్మాత. కాట్రగడ్డ మురారి ముక్కుసూటి మనిషి, హీరో అయినా, డైరెక్టర్ అయినా, నిర్మాత మాట వినాలనే మైండ్ సెట్ ఉన్న నిర్మాత. వెంకటేష్ హీరో గ మొదటి చిత్రం”కలియుగ పాండవులు” ప్రారంభం కాగానే, రెండవ చిత్రం నేను నిర్మిస్తాను అని రామానాయుడు గారిని కల్సి అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తరువాత వెంకటేష్ గారు అయిదు చిత్రాలు చేసిన తరువాత, ఏడో సినిమాగా మురారి గారికి కాల్ షీట్స్ ఇచ్చారు, అప్పటి దాక ఓపికగా ఎదురు చూసిన మురారి గారు కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ” శ్రీనివాస కళ్యాణం” చిత్రం ప్రారంభించారు. షూటింగ్ జరుగుతున్న సందర్భం లో, వెంకటేష్ గారు అంతకు ముందే నటించిన త్రిమూర్తులు సినిమాకు డబ్బింగ్ చెప్పే పని ఉన్నది తనకు ఒక రోజు గ్యాప్ కావాలి అని అడిగారు..షూటింగ్ మధ్యలో చెపితే ఎలాగూ, ముందు మీ షాట్స్ పూర్తి చేసి కొంచెం ముందుగానే పంపించేస్తాము షూటింగ్ కంటిన్యూ చేయండి అని చెప్పారట మురారి గారు.
వెంకటేష్ గారు ఎన్ని విధాలుగా చెప్పిన ఆయన కన్వెన్స్ కాకపోయే సరికి, వెంకటేష్ షూటింగ్ స్పాట్ నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారట. మురారి గారు కోపం తో రగిలిపోయారు, అయినా బయట పడకుండా, యెడ ముఖం,పేడ ముఖంగానే చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేసారు సినిమా హిట్. మురారి గారు మాత్రం వెంకటేష్ గారికి ఇవ్వ వలసిన బాలన్స్ పేమెంట్ ఇవ్వలేదు. పేమెంట్ కోసం కబురు పెడితే, నేను కూడా మరో అయిదు చిత్రాలు తీసిన తరువాత అమౌంట్ సెటిల్ చేస్తాను అని సమాధానం ఇచ్చారట. చివరకు రామ నాయుడు గారు నిర్మాతల మండలిలో పంచాయితీ పెట్టారు, తాను అడ్వాన్స్ ఇచ్చిన తరువాత కూడా అయిదు చిత్రాల తరువాత తనకు అవకాశం ఇచ్చారు కాబట్టి తాను కూడా అలాగే ఇస్తానని ఖరాఖండి గ చెప్పారట మురారి. చివరకు డైరెక్టర్ బాలచందర్ జోక్యం చేసుకొని వివాదాన్ని పరిష్కరించారట. సీతయ్య ఎవరి మాట వినడు లాగానే, మురారి ముక్కోపి అని పేరు ఉండేది అప్పట్లో, కానీ ఆయన ఆగ్రహాన్ని ధర్మాగ్రహం అనే వారు కూడా లేకపోలేదు. నిర్మాతలు తల వంచే రోజులు దాపురించగానే సినీ నిర్మాణానికి స్వస్తి పలికారు మురారి..!!