in

KATAPPA REAL LIFE KASHTALU!

ట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడో తెలిసిపోయింది, కానీ కట్టప్ప నటుడు ఎలా అయ్యారో మీకు తెలుసా? రెండు మూడు నిమిషాల గెస్ట్ పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి తమిళంలో స్టార్ హీరోగా  ఎదిగిన వైనం, దాదాపుగా వంద సినిమాలు హీరో గ చేసి, ఆ తరువాత రూట్ మార్చి క్యారెక్టర్ నటుడిగా కొనసాగుతున్నారు. కట్టప్ప సినీ ప్రస్థాన కష్టాల కధ ఏమిటి ?కట్టప్ప కష్టాల కడలి దాటటం లో సహాయం చేసిన వారెవరు? చాల ప్రశ్నలు ఉన్నాయి కదూ! వాటన్నిటికీ సమాధానం కావాలంటే, చెప్పబోయే కధ చదవండి. రంగరాజ్ ఇది  సత్యరాజ్ గారి అసలు పేరు, నటుడవ్వాలి అని మద్రాసు చేరుకున్నాక, తమ ఉరి వాడైనా నటుడు శివకుమార్ గారిని {సూర్య ,కార్తీ వాళ్ళ నాన్న } కలిసి, వారి ద్వారా ఒక డ్రామా కంపెనీ లో చేరి, కొన్ని రోజుల తరువాత ,ఒక సినిమాకు ప్రొడక్షన్ అసిస్టెంట్ గ పని చేసారు, అదే చిత్రం లో “ఎస్ బాస్ ” క్యారెక్టర్ ఒకటి చేసారు, ప్రొడెక్షన్ అసిస్టెంట్ గ రంగరాజ్ అని, నటుడిగా తన అక్క కుమారుడి పేరులోని  సత్య ను ముందు చేర్చి సత్యరాజ్ అని టైటిల్స్ లో వేసుకున్నారు,ఆలా రంగరాజ్ కాస్త సత్యరాజ్ అయ్యారు. వివాహం తరువాత కుటుంబ పోషణార్ధం, ఐస్ క్రీం పార్లర్ పెట్టారు, పెట్టుబడి ఐస్క్రీమ్ లాగా కరిగి పోయింది, ఐరన్ స్క్రాప్ బిజినెస్ పెట్టారు, అందులోను పెట్టిన డబ్బు స్క్రాప్ అయిపోయేసరికి, ఇక లాభం లేదని సినిమా కెరీర్ నే సీరియస్ గ తీసుకొని ట్రయల్స్ మొదలు పెట్టారు. కాలేజీ క్లాసుమేట్ అయిన  డైరెక్టర్ మణివణ్ణన్ గారు, సత్యరాజ్ కు విలన్ క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించారు, విలన్ గ విజయం సాధించి, భారతి రాజా తెలుగులో నిర్మించిన , చిరంజీవి గారు నటించిన” ఆరాధన “చిత్ర తమిళ వెర్షన్ హీరో సత్యరాజ్ గారే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, హీరోగా స్థిరపడి, ట్రెండ్ ఫాలో అవుతూ క్యారెక్టర్ నటుడిగా మారి, తెలుగులో, శంఖం, మిర్చి, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ దగ్గర అయ్యారు, ఈ మధ్యనే బ్రహ్మోత్సవం చేసి, జెర్సీ వేసుకొని, ప్రతి రోజు పండగే అంటున్నారు. ఇదండీ కట్టప్ప గారు  కష్టాల కడలి దాటిన తీరు. ఏ నటుడి నటప్రయాణం చూసిన, కష్టాల మయమే కదా,అసలు విజయం అంటేనే బోలెడు కష్టాల తరువాత వచ్చే విరామం.

60 years for SEETHARAMA KALYANAM!

KUSHBU KI COFFEE ISTE KAALU VIRAGODTHANANNA VENKATESH!