in

KARTHI NI HERO GA MARCHINA SURYA!

కార్తీ తమిళ నటుడు, అయినా కూడా కమల్ హాసన్ ,రజినీకాంత్ తరువాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయినా నటుడు. తెలుగు వాడు కాక పోయిన తెలుగు మాట్లాడటం తెలియటం వలన తెలుగు ఆడియన్స్ కు  చాల త్వరగా దగ్గర అయిన నటుడు కార్తీ, అసలు నటుడు అవ్వాలని ఎప్పుడు అనుకోని కార్తీ గారు హీరో అయ్యారు. ఎలా? హీరో సూర్య గారి తమ్ముడు కాబట్టి హీరో అయ్యారు అనుకొంటే పప్పులో కాలు వేసినట్లే. తండ్రి శివకుమార్ పేరున్న నటుడు, అన్న సూర్య కూడా హీరోనే, కానీ కార్తీ గారి కి కూడా సినిమా అంటే మక్కువ ఉండటం వలన ఎప్పటికి అయిన ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి అనుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే విధి ఇంకోటి తలుస్తుంది, అన్నట్లు మణిరత్నం డైరెక్షన్ లో సూర్య హీరో గ నటిస్తున్న” యువ “చిత్రంలో సూర్య తమ్ముడిగా నటించే అవకాశం వచ్చింది, అప్పుడు కార్తీ 94 కె.జి. బరువు తో బొద్దుగా ఉండటం వలన, మణిరత్నం గారు నాకు సూర్య కి తమ్ముడు కావలి అన్నయ్య కాదు అని చెప్పారు, ఆలా ఆ అవకాశం పోయినందుకు కార్తీ గారు బాధ పడకుండా తనకు డైరేక్షన్ మీద ఉన్న ఇంటరెస్ట్ గురించి చెప్పి మణిరత్నం గారి వద్ద అసిస్టెంట్ గ చేరిపోయారు. త్రీ ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గ గడచిపోయాయి,మధ్యలో నటుడిగా ఎన్నో అవకాశాలు వచ్చిన అటువైపు చూడలేదు. ఆ సందర్భం లో సూర్య గారు పిలిచి ఎంతో విలువైన సలహా ఇచ్చారు, ” నువ్వు డైరెక్టర్ అవ్వాలి అంటే ఏ వయసులో అయిన అవ్వచ్చు కానీ హీరో అవ్వాలి అంటే ఈ వయసు దాటితే నిన్ను ఎవరు పట్టించుకోరు, కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో అంతగా నీకు నచ్చక పోతే డైరేక్షన్ డిపార్ట్మెంట్ లో కంటిన్యూ చేయవచ్చు అని” జ్ఞానోదయం అయిన కార్తీ గారు పరుత్తివీరన్ అనే సినిమా లో హీరో గ చేసారు, ఫిలింఫేర్ అవార్డు కూడా సాధించారు, తరువాత తాను నటించిన యుగానికొక్కడు ,ఆవారా చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గర “అయ్యారు, నాగార్జున గారి తో కలసి ఊపిరి  స్ట్రెయిట్ మూవీ లో చేసి తెలుగు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇదండీ కార్తీ గారు హీరో అవటం వెనుక ఉన్న కథ.

F CUBE ‘POKIRI’

ismart beauties doubled their remuneration!