in

Kannada beauties ruling tollywood!

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువగా పరాయి రాష్ట్రాల నుంచి వస్తున్న హీరోయిన్స్ మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అది వేరే విషయం. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ ఎక్కువ హిట్స్ కొడుతున్న హీరోయిన్స్ లో కన్నడ తారలే ఎక్కువమంది ఉన్నారు.. దీనికి ఉదాహరణ ప్రస్తుతం టాలీవుడ్ లో వరస ఆఫర్స్ తోటి దూసుకెళ్తున్న హీరోయిన్స్.. స్వీటీ అనుష్క, పూజ హెగ్డే, రష్మిక మందన్న, వీరందరూ కన్నడ వాసులే.. వీరే కాకుండా ఇక్కడ ఆఫర్స్ వస్తే ఇక్కడే సెటిల్ అవుదామని ఎదురు చూస్తున్న భామలు మరికొందరు ఉన్నారు, వారే.. నిధి అగర్వాల్, నాభ నటేష్, నాని ‘జెర్సీ’ మూవీ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్.

వీళ్ళందరూ కన్నడ హీరోయిన్స్ కావడం విశేషం..అయితే అక్కడి వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇక్కడ ఇన్ని సినిమా ఛాన్సులు వస్తున్నాయి అనే దాని మీద ఇప్పుడు చర్చ మొదలైంది.. దీనికి ఇండస్ట్రీలో పలు కారణాలు వినిపిస్తున్నాయి..అనుష్క, పూజ, రష్మిక వీళ్ళందరూ ఛాన్సులు కోసం ఇక్కడికి వచ్చి టాప్ హీరోయిన్స్ గ ఎదిగిన తరువాత కూడా.. వాళ్ళు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉండి మన హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు రెస్పెక్ట్ ఇస్తూ మన వాళ్ళ మనసులని దోచుకున్నారని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా, వాళ్లకు కన్నడ లో ఇప్పుడు చాల ఆఫర్స్ వస్తున్న కానీ ఈ భామలు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే మన ఇండస్ట్రీ లో పని చేయడం వారికీ తెలుగు సినిమా మీద ఉన్న ఇంటరెస్ట్ ఏంటో అర్ధం అవుతుంది.. ఇది వరకు ముంబై లేదా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్స్ ల వీరు చేయకపోవడంతో వీరి మీద మన వాళ్ళు మనసు పారేసుకున్నారట.. అందుకే అనుష్క, పూజ, రష్మిక, నిధి లాంటి హీరోయిన్స్ ఇక్కడ టాలీవుడ్ ను ఏలుతున్నారు..

director wrote ‘v’ for pawan and mahesh : sudheer babu

heroines debuted before turning 18!