కమల హాసన్ వంటి గొప్ప నటుడు చేత సెహబాష్ అనిపించుకున్న నటుడు నరేష్. నరేష్ నటించిన ఒక చిత్రం తమిళం లో తీయడానికి కమల్ ని కలిసిన నిర్మాతతో, నేను ఆ పాత్ర నరేష్ అంత గొప్పగా నటించలేనేమో అనటం, కితాబు కాకా మరేమిటి? 1991 లో పి.యెన్. రామ చంద్ర రావు దర్శకత్వం లో నరేష్ నటించిన సినిమా “చిత్రం భళారే విచిత్రం “. ఆ మూవీ లో నటుడు నరేష్ దాదాపు సగం సినిమాలో స్త్రీ పాత్రలోనే కనిపిస్తారు.అప్పటివరకు తెలుగు చిత్రాలలో ఏ నటుడు కూడా పూర్తి స్థాయి లో స్త్రీ పాత్రలో కనిపించ లేదు. ఆ చిత్రంలో నరేష్ ప్రదర్శించిన హావ, భావాలూ ప్రేక్షకులను మెప్పించింది.
నరేష్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని అందరు ఆశ్చర్య పోయారు. అదే సినిమాను తమిళంలో నిర్మించాలని కమల్ గారికి ఆ సినిమా చూపించటం జరిగింది, ఆ సినిమా చూసిన కమల్ గారు నేను నరేష్ అంత గొప్పగా నటించలేనేమో అని ఆ పాత్రను రిజెక్ట్ చేశారట.బహుశా ఆ వెలితి కమల్ గారి మనసులో ఉండి పోయిందో ఏమో, ఆ తరువాత చాల సంవత్సరాల గ్యాప్ తరువాత ” భామనే సత్యభామనే” చిత్రంలో అదే తరహా ప్రయోగం చేసారు. కమల్ నటించిన సత్యభామ క్యారెక్టర్ కి నరేష్ గారు నటించిన పాత్రే స్ఫూర్తి అయి ఉండవచ్చు.