
పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ‘ఇండియన్-2’, ‘సత్యభామ’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తన అభిమానులతో ఆమె సరదాగా ముచ్చటించింది. ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చింది. ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను ప్రసవానంతర (పోస్ట్ పార్టమ్) డిప్రెషన్‌ను ఎదుర్కొన్నానని కాజల్ చెప్పింది. అది సర్వసాధారణమని, మహిళలు ఎవరైనా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో ఇబ్బందిపడుతుంటే కుటుంబం వారికి అండగా నిలవాలని సూచించింది. పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత సమయాన్ని మహిళలు కేటాయించుకోవాలని కాజల్ చెప్పింది.