in

Kajal Aggarwal playing a powerful role in Satyabhama!

సౌత్ సూపర్ స్టార్ కమల హాసన్‌కి జంటగా ప్యాన్ ఇండియా చిత్రం ‘ఇండియన్‌ 2’ నటిస్తున్న ఆమె  తెలుగు అగ్ర నటుడు బాలకృష్ణ సరసన ‘భగవంత్ కేసరి’లో హీరోయిన్ గా చేస్తోంది. అంతేకాదు ఓ ఫీమేల్ లీడ్ సినిమా కూడా చేస్తోందామె. సోమవారం కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి ‘సత్యభామ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపిస్తోంది. సినిమాలో ఆమె క్యారెక్టర్ ను చూపెట్టే ఫస్ట్ గ్లింప్స్‌ ను కూడా విడుదల చేశారు.

అందులో సెల్ లో ఉన్న ఓ నిందితుడు ఎంత కొట్టినా నోరు మెదపకపోవడంతో చీర, చేతి గాజులతో వచ్చిన కాజల్ కొట్టిన దెబ్బలకు నిజం చెప్పేసే సీన్ ఆసక్తికరంగా ఉంది. మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కాజల్ మెప్పించనుంది. ఈ సినిమాతో అఖిల్ డేగల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గూఢచారి, మేజర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఈ సినిమాను సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..!!

Ameesha Patel surrenders in cheque bounce case!

JD Chakravarthy Denies Dating anchor Vishnu Priya!