ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవి ఆచార్యతో పాటు మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం తమిళ సినిమా భారతీయుడు 2లో కమలహాసన్ సరసన నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు కూడా కాజల్ కమిట్మెంట్ అయింది. ఈ కొత్త సినిమా ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ టచ్ చేయని హార్రర్ పాత్రలో కాజల్ కనిపించబోతుందని తెలుస్తుంది. డీకే దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కథ విన్న కాజల్ ఓకే చెప్పేసింది కూడా.
ఇందులో కాజల్ కిచ్లుతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారు. నలుగురు అమ్మాయిల మధ్య నడిచే కథగా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఇప్పటి వరకు హార్రర్ జోనల్ కు కాజల్ వెళ్లలేదు. మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా నో చెప్పింది ఈమె. లవ్, రొమాన్స్, ఫ్యామిలీ అంటూ ఇటు వైపే తిరిగిన కాజల్ తొలిసారి భయపెట్టడానికి వస్తుంది. మొత్తానికి కుమారిగా ఉన్నపుడు కూల్ సినిమాలు చేసి శ్రీమతిగా మారగానే కాజల్ అగర్వాల్ హార్రర్ అవతారమెత్తనుంది..