in

JUSTICE DELAYED IS JUSTICE DENIED!

హానటి సావిత్రి నట జీవితం ఎంతో ఉజ్వలం, అందరికి ఆదర్శప్రాయం కానీ, ఆమె వ్యక్తిగత జీవితం ఆసాంతం వ్యధాభరితం, విధి ఆమె జీవితం తో ఎంత కర్కశంగా ఆడుకుందో అందరికి తెలిసిన విషయమే, చాలామందికి అదో హెచ్చరిక. దివంగత సావిత్రి గారికి చెందిన నివాస భూమికి సంబంధించిన కేసులో 47 ఏళ్ళ తరువాత ఆమెకు న్యాయం జరిగింది. హైదరాబాద్ లో సావిత్రికి సంబంధించిన 450 కోట్ల విలువ కలిగిన నివాస స్థలం చట్టబద్ధంగా ఆమెకు చెందుతుంది అని నిర్ధారించబడింది. ఆ భూమిని 1967 లో ఆమె ఉజ్వలంగా వెలిగి పోతున్న రోజులలో ఆమె సోదరికి ఆమె ఉచితంగా ఇచ్చారు, ఆ తరువాత ఆమె పరిస్థితి బాగోలేని రోజులలో, దానిని తిరిగి ఇవ్వమని కోరగా ఆమె సోదరి అందుకు నిరాకరించింది, దానితో 1974 లో సావిత్రి కేసు ఫైల్ చేసారు, 1980 లో సావిత్రి కేసు ఓడిపోయారు, ఆ తరువాత ఆమె వారసులు కేసు తిరిగి ఫైల్ చేసారు ఇలా వివిధ కోర్టులో కేసు నడిచి చివరకు 2022 లో హైదరాబాద్ హై కోర్ట్, ఈ కేసులో రాజీ చేయాలనీ నిర్ణయించింది, దీనికి ఇరు వర్గాలు అంగీకరించటం తో సావిత్రి వారసులు ఒక్కొక్కరికి 163 కోట్లు,సావిత్రి సిస్టర్ కి 124 కోట్లు ఇవ్వాలని కోర్ట్ నిర్ణయించింది.

సావిత్రి బతికి ఉండగా ఆమెకు అక్కరకు రాని ఆస్తి ఆమె వారసులకు దక్కింది. అందుకే” జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ ” అంటారు, సకాలం లో న్యాయం జరగక పోతే ఆ తరువాత న్యాయం జరిగిన జరగనట్లే, భావించాలి అనేందుకు ఒక చక్కటి ఉదాహరణ సావిత్రి గారి ఉదంతం. ఆమె ఆర్ధికంగా పతనావస్థలో ఉన్నపుడు ఆమె మీద దాడి చేసిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆమె బ్రతుకుని రోడ్డుకు ఈడ్చింది, ఆమె కార్ షెడ్ లో నివసించెట్లు చేసింది. 16 సంవత్సరాలు కేసు నడిచిన తరువాత 1995 లో ఐటీ డిపార్ట్మెంట్ 27 లక్షలు తిరిగి ఇచ్చింది, 27 సంవత్సరాల తరువాత అంటే 2011 లో ఐ.టి డిపార్ట్మెంట్ సావిత్రి కుటుంబానికి 4 .80 కోట్లు తిరిగి ఇచ్చింది. పరోక్షంగా సావిత్రి జీవితాన్ని పతనపు అంచులకు నెట్టిన ఐ.టి డిపార్ట్మెంట్ ఆమె మరణం తరువాత ఎంత డబ్బు తిరిగి ఇచ్చిన ఏమి ప్రయోజనం.బ్రతికి ఉండగా ఆమె ఎంతో మందికి ఆర్ధికంగా సహాయం చేసారు అలాగే ఆమె మరణానంతరం కూడా ఆమె ఆర్ధికంగా తమ వారసులకు కోట్లు ఇచ్చి వెళ్లిపోయారు. అసలు విధికి ఆమె అంటే ఎందుకు అంత కసి, ఎందుకంత పగ, ఎందుకంత కర్కశం గ వెంటాడిందో అర్ధం కాదు. కష్టాలు మానవులు అందరికి సహజం, కానీ ఇంత దారుణమయిన కష్టాలు ఎందుకో? సావిత్రి గారు ఏమయినా శాపగ్రస్తురాలయిన గంధర్వురాల? ఏమో?.

Alia Bhatt agreed for second film with Rajamouli?

Gautham Menon confirms Gharshana 2 with Venkatesh!