in

Alia Bhatt agreed for second film with Rajamouli?

బ్రహ్మాస్త్ర మూవీ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌. భర్త రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు సృష్టిస్తుండటంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడామె టాలీవుడ్‌లో మరో సినిమా చేయబోతోందని, అది కూడా తనకు ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి సూపర్‌ హిట్‌ అందించిన రాజమౌళి తోనే అంటూ వార్తలు వస్తున్నాయి..

ఇన్నాళ్లూ పుకార్లుగా ఉన్న ఈ వార్తలు ఇప్పుడు అధికారికమయ్యాయంటూ ఫిల్మ్‌ క్రిటిక్‌, ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమేర్‌ సంధు ఓ ట్వీట్‌ చేశాడు. “అధికారికంగా ధృవీకరించారు. మహేష్‌బాబు తో రాజమౌళి తీస్తున్న మూవీలో నటించడానికి ఆలియా భట్‌ అంగీకరించింది. ఎస్‌ఎస్‌ఎంబీ29 షూటింగ్‌ ఆలియా ప్రసవించిన తర్వాత ప్రారంభమవుతుంది” అని ఉమేర్‌ ట్వీట్‌ చేయడం విశేషం. ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆలియా తొలిసారి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది..!!

Aa Ammayi Gurinchi Meeku Cheppali!

happy birthday upendra!