
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మ[/qodef_dropcaps] న టాలీవుడ్ లో మహేష్ బాబు,ఎన్ టీ ఆర్ ఇద్దరూ స్టార్ హీరోలే.అయితే వీళ్లిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు సార్లు పోటీ పడ్డారు. మొదటి సారి 2003 లో మహేష్ బాబు ఒక్కడు సినిమాతో పోటీ పడగా…ఎన్ టి ఆర్ నాగ సినిమాతో వచ్చాడు.ఆ రెండు సినిమాల్లో ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది కాగా నాగ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. రెండో సారి 2010 లో మహేష్ బాబు ఖలేజా సినిమాతో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.ఎన్ టి ఆర్ బృందావనం సినిమా తో వచ్చాడు.బృందావనం సినిమాకు కొత్త దర్శకుడు కావడంతో అంచనాలు పెద్దగా లేవు.రెండు సినిమాల్లో బృందావనం మంచి విజయం సాధించగా..ఖలేజా సినిమా బాగున్నప్పటికీ పెద్దగా ఆడలేదు. మూడోవ సారి 2011 లో దూకుడుతో రాగా..ఎన్ టి ఆర్ ఊసరవెల్లి సినిమాతో ఢీకొన్నాడు.ఇందులో దూకుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను బద్దల కొట్టి సూపర్ హిట్టయ్యింది.ఊసరవెల్లి సినిమా బాగున్నప్పటికీ మాస్ ప్రేక్షకులకి అర్థం కాలేదు. నాలుగో సారి 2014 లో మన ప్రిన్స్ ఆగడు సినిమాతో రాగా మన టైగర్ రభస సినిమాతో వచ్చాడు.అయితే ఈ రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇలా మహేష్ బాబు,ఎన్ టి ఆర్ బాక్స్ వద్ద ఐదు సార్లు పోటీపడగా మహేష్ బాబు రెండు సార్లు విజయం సాధిస్తే ఎన్ టి ఆర్ రెండు సార్లు విజయం సాధించాడు ఒకసారి ఇద్దరూ ఓడిపోయారు.