in

JR NTR to Face Off Against Hrithik Roshan in ‘War 2’?

హృతిక్ తారక్ కలిసి డాన్సులు ఫైట్లు చేయడం చూస్తే థియేటర్లలో కుదురుగా కూర్చోవడం కష్టమేనని ఆల్రెడీ ట్వీట్లు మొదలైపోయాయి. ఇంతకీ వార్ 2కి తారక్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత? ప్రస్తుతం జూనియర్ కు కేవలం పారితోషికమే వంద కోట్లు చెల్లించే రేంజ్ కు వెళ్ళింది. దక్షిణాది పరిశ్రమలో అతి పెద్ద మొత్తం అందుకుంటున్న టాప్ 5 స్టార్స్ లో చేరిపోయాడు. ఇప్పుడు వార్ 2 కోసం ముప్పై కోట్లు ఆఫర్ చేశారని వినికిడి. అయితే ఇది ప్రత్యేక పాత్ర కోసమా లేక ఫుల్ ప్యాకేజ్ వంద కోట్లు ఇచ్చి పూర్తి స్థాయి పాత్ర చేయిస్తారా అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అ

యాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో క్యామియోల రూపంలో యష్ రాజ్ స్పైవర్స్ హీరోలందరూ కనిపిస్తారని ఇప్పటికే పలు ఛానల్స్ లో హోరెత్తిపోతోంది. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు వార్ 2 కనక బ్లాక్ బస్టర్ అయితే స్టార్ డం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. ప్రస్తుతం కొరటాల శివ ప్రాజెక్టు మీదే పూర్తిగా ఫోకస్ పెట్టిన తారక్ ఎప్పుడో కమిటైన ప్రశాంత్ నీల్ సినిమా కన్నా ముందే వార్ 2 పూర్తి చేసే అవకాశాలున్నాయి. కాకపోతే పాత్ర పరిధి, ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్స్..!!

BHANUMATHI GARU TENSION PADINA VELA!

Ravanasura!