ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ఎన్టీఆర్ కంటెస్టెంట్స్ తో ఇంట్రాక్ట్ అవుతున్న విధానం కు అంతా కూడా ఫిదా అవుతున్నారు. వయసుకు తగ్గట్లుగా కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ మాటలు కలుపుతూ ఆకట్టుకుంటున్నాడు. అంతకు ముందు ఎపిసోడ్ లో తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి షేర్ చేసిన ఎన్టీఆర్ తాజా ఎపిసోడ్ లో తన భార్య లక్ష్మి ప్రణతి గురించిన విషయాలను వెళ్లడించాడు. ఆమె పెళ్లి సమయంలో ఎస్ లేదా నో చెప్పక పోవడంతో చాలా తికమక పడ్డట్లుగా చెప్పుకొచ్చాడు.
jr ntr reveals about memories during his marriage!
పెళ్లి చూపులు సమయంలో లక్ష్మి ప్రణతిని చూసి నేను వెంటనే ఓకే చెప్పేశాను. కాని తాను మాత్రం వెంటనే ఓకే చెప్పలేదు. నేను అడిగినా కూడా సరైన సమాధానం చెప్పలేదు. బలవంతం చేసి ఏమైనా పెళ్లి చేస్తున్నారా అని అడిగాను అంటూ అందరితో నవ్వులు పూయించాడు. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి 8 నెలల గ్యాప్ వచ్చిందని.. ఆ సమయంలో లక్ష్మి ప్రణతి నుండి ఓకే అనే జవాబు వచ్చిందని ఈ సందర్బంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు..