యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ బిజీ గా ఉన్నాడు. RRR సినిమా తరవాత గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షెడ్యూల్ దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం. దేవర చేస్తునే బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం వార్ 2 లోనూ నటిస్తున్నాడు. వీటి తరవాత ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో మూవీ స్టార్ట్ అవనుంది. ఇప్పటికే ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నటు టాక్. ఎన్టీఆర్ పక్కన నషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ పై పలువురు ఆసక్తిగా ఉన్నారు.
నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలవనుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. షూటింగ్ ఇంకా మొదలు కాకముందే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. సుమారు 15 కంట్రీస్ లో ఎన్టీఆర్ 31 షూటింగ్ జరగనుందని టాక్..!