in

jr ntr – prashanth neel movie gets a title?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత రెండు భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి కొరటాల డైరెక్షన్‌‌లో, మరోకటి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నాడు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోపై ఫ్యాన్స్ కు భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్ల వసూలు చేసిన నీల్.. యంగ్ టైగర్ తో ఎంత వసూలు చేస్తాడోనని అభిమానులు అతృతగా ఉన్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ 31 సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్ట్రింగ్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేశారన్న న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

ఇప్పటికే ఎన్టీఆర్ 31 సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రానికి  ఓ మంచి పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిల్​ పెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తే బావుంటుందని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళుతుందని టాక్ నడుస్తోంది.

Actress Poorna announces her engagement!

Urfi Javed Lashes At Trolls Who Wished Her Death!