ఎన్టీఆర్ కి కార్స్ అంటే మహా ఇష్టం. మార్కెట్ లో ఏదైనా లగ్జరీ కారు వచ్చిందంటే అది తన గ్యారేజ్ లో ఉండాల్సిందే. ఇప్పటికే ఆయన ఇంట్లో పలు కార్లుండగా..లంబోర్గినీ కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ కారు కూడా ఇటీవల ఆ జాబితాలో చేరింది. ఇప్పటికే లగ్జరీ ఫీచర్స్ తో ఉన్న అనేక కాస్ట్లీ కార్లను బైక్స్ ను తారక్ ఇష్టంగా తెప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇటాలియన్ లగ్జరీ కారుగా పేరొందిన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫిటే క్యాప్సుల్ కారుని ఎన్టీఆర్ ఇంపోర్ట్ చేసుకున్నారు.
అయితే ఇండియాలో ఈ మోడల్ కారు కొన్న మొదటి హీరో ఎన్టీఆరే అని అంటున్నారు ఫ్యాన్స్. ఇది అత్యంత ఖరీదైనదిగా కూడా చెప్తున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ ఇంపోర్ట్ కంపెనీ ద్వారా బుక్ చేసుకున్న లంబోర్ఘిని ఉరుస్ కారు ఎన్టీఆర్ ఇంటి ముందుకు వచ్చి ఆగగా.. ఆ కారు దెగ్గర ఎన్టీఆర్ ఇచ్చిన స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో సీనియర్ సినీ నటుడు శ్రీకాంత్, మరో స్నేహితుడితో ఎన్టీఆర్ కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం కారుతో పాటు ఎన్టీఆర్ దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.