in

arya is not a cheater : Chennai city police

తమిళ హీరో ఆర్య మోసగాడు కాదని తేల్చారు తమిళనాడు పోలీసులు. ఆర్య తనని మోసం చేసాడని జర్మనీలో స్థిరపడ్డ ఒక తమిళ యువతి కొన్నాళ్ల క్రితం కేసు వేసింది. తనతో ఆన్ లైన్ లో రోజూ సెక్స్ చాట్ చేసేవాడు అని ఆమె చెప్పింది. కొన్నాళ్ల తర్వాత తన నుంచి 90 లక్షలు లాగాడని ఆమె ఆరోపించింది..తన ఆరోపణలకు రుజువుగా ఆమె తన సెల్ ఫోన్ రికార్డులు చూపించింది. చెన్నై సైబర్ క్రైం పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్యకు క్లీన్ చీట్ ఇచ్చారు.

ఈ కేసులో ఆర్య తప్పేమి లేదని పోలీసుల విచారణలో తేలింది. ఆర్య పేరుని, ఫోటోని వాడుకొని ఆ అమ్మాయిని ఇద్దరు యువకులు మోసం చేసారని తేల్చారు పోలీసులు. మొహమ్మద్ అర్మాన్, మొహమ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు ఆన్లైన్ కేటుగాళ్లు ఆమెని బుట్టలో వేసుకున్నారు. తనతో చాట్ చేస్తున్నది ఆర్య అని భావించిన ఆ అమ్మాయి 90 లక్షల రూపాయల డబ్బులు కూడా ఆన్ లైన్ లో ట్రాన్స్ఫర్ చేసింది.

anchor Anasuya bags a role in ‘Godfather’!

punjabi kudi rakul shines In White Dress!