in

JP GARI JEEVITHANNI MARCHESINA DASARI!

యప్రకాష్ రెడ్డి నటుడిగా సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అనేది ఒక ఇంటెరెస్టింగ్ స్టోరీ, అది తెలుసుకోవాలని ఉందా? అయితే ఇక్కడ చెప్పే విషయాన్ని చదవండి. జయప్రకాష్ రెడ్డి గారు నల్గొండ లో ఉంటున్నపుడు,స్నేహితులతో కలసి డ్రామా ( Dr. Raja Rao Academy Memorial Associtain) అనే ఒక నాటక కంపెనీ మొదలెట్టారు. యూసుఫ్ బాబు అనే స్నేహితుడు ప్రజా పోరు అనే పత్రిక నడిపేవారు, దాని మొదటి వార్షికోత్సవానికి దాసరి నారాయణ రావు గారిని ముఖ్య అతిధి గ పిలవటం ఆయన రావటం జరిగింది.ఆ సందర్భం లో డ్రామా కంపెనీ వారు గప్ చుప్ అనే ఒక నాటకం ప్రదర్శించారు, అప్పట్లో పాలిటిక్స్, ఉదయం పేపర్, డైరెక్టర్ గ చాల బిజీ గ ఉన్న దాసరి గారు ఒక 15 నిముషాలు ఉండే వెళ్ళిపోతానని చెప్పారు..

కానీ ఆయన గప్ చుప్ నాటకం ఆసాంతం చూసి స్టేజి మీదకు వచ్చి, జయప్రకాష్ గారి నటనను మెచ్చుకొని, ఈ కొండల మధ్య ఉన్న వజ్రం ఉండవలసింది సినీ రంగం లో నేను ఇతనికి అవకాశం ఇస్తాను అని స్టేజి మీద ప్రకటించి వెళ్లిపోయారు. ఆ తరువాత వారం తిరగక ముందే జయ ప్రకాష్ రెడ్డి కి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి పిలుపు వచ్చింది, దాసరి గారి డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న బ్రహ్మ పుత్రుడు అనే చిత్రం లో జయప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆలా 1988 లో ప్రారంభం అయినా జయ ప్రకాష్ రెడ్డి గారి సినీ ప్రయూణం నిరాటంకం గ, నిరంతరం గా సాగి పోతున్నది.

is kajal dating bellamkonda sreenivas?

tollywood heroes trying for pan india star status!