
తూర్పు జయ ప్రకాష్ రెడ్డి, తెలుగు వెండి తెర విలన్, నిండయినా విగ్రహం,స్పష్టమయిన ఉఛ్చారణ తో, వివిధ మాండలికలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన నటుడు. విలనిజం మాత్రమే కాక, హాస్య పాత్రలలో కూడా మెప్పిస్తున్న మంచి నటుడు. ఆయన సినిమా పరిచయం ఎలా జరింగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ ఇంటరెస్టింగ్ స్టోరీ చదవండి. జయప్రకాశ్ గారు స్కూల్ ఫైనల్ చదువుతున్న రోజులలో, స్కూల్ మాస్టర్ ముందు ఒక నాటకం డైలాగ్స్ చెప్పి తనకు కూడా నటించే ఛాన్స్ ఇవ్వమని అడిగారు. ఆ మాస్టర్ జయప్రకాశ్ గారిని ముఖం వాచెట్లు చీవాట్లు పెట్టి, నువ్వు నటుడిగా పనికి రావు అని తేల్చేసారు. రెండుగంటలు కన్నీరు మున్నీరు గ విలపించిన జయప్రకాశ్ గారు ఆ తరువాత పట్టుదలగా స్టేజి నటుడిగా ఎదిగారు. జయప్రకాశ్ గారు నల్గొండ లో ఉంటున్న రోజుల్లో ఒక నాటక ప్రదర్శన కు దాసరి నారాయణ రావు గారు ముక్ష్య అతిధి గ వచ్చారు, జయప్రకాశ్ గారి ప్రతిభ చూసిన దాసరి స్టేజి మీదే జయప్రకాశ్ గారికి సినిమా అవకాశం ఇస్తాను అని చెప్పారు, చెప్పినట్లుగానే దాసరి గారు డైరెక్ట్ చేస్తున్న బ్రహ్మపుత్రుడు సినిమా లో చాన్సు ఇచ్చారు. ఆ తరువాత కలిసివుందాం రా, సమరసింహా రెడ్డి వంటి సినిమాలతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

