
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సరసన అతిలోక సుందరి శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే నటిస్తుంది అంటు పలుమార్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ పుకార్లు ఇప్పుడు నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే చిత్రం లొ నటిస్తున్న విజయ్ దీని తరువాత పూరి తో ‘ఫైటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫైటర్ సినిమా కి విజయ్ తొ కలిసి నటించేందుకు జాన్వీ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ‘ఫైటర్’ కోసం జాన్వి రూ.3.5 కోట్లు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే టాలీవుడ్ లొ అరంగేట్రం చేసిన సినిమాకి ఇంత ఎక్కువ పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గ రికార్డు సెట్ చేస్తుంది జాన్వీ.