
హీరోయిన్ గ జీవిత గారు అంతగా బాగాలేరు, వేరే అమ్మాయిని ట్రై చేయకూడదా అని సజెస్ట్ చేసిన రాజశేఖర్ గారు, తరువాత రోజు ఆయనకు ప్రొడక్షన్ నుంచి కార్ వేళ్ళ లేదు, అయన స్థానం లో ఇంకొక హీరో ను తీసుకున్నారట. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా తెలిసింది అనే విషయం తెలుసుకుందామా.” హలో యార్ పేసరిదే ”అనే తమిళ్ చిత్రం షూటింగ్ సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరెక్టర్ రామ్ రాజన్ గారు చెప్పిన సీన్, ఆయనకు కావలసిన విధంగా రాజశేఖర్ గారు చేయకుండా, తన స్టైల్ లో తాను చేస్తున్నారట, చాలా టేకులు చేయవలసి వచ్చింది.షూటింగ్ గ్యాప్ లో రామ్ రాజన్ గారు జీవిత గురించి రాజశేఖర్ గారి అభిప్రాయం అడిగారట, అమ్మాయి పరవాలేదు, కానీ ఇంతకంటే బెటర్ అమ్మాయి ఎవరయినా ఉంటె ట్రై చెయ్యటం మంచిది, అని చెప్పారట. మరి రామ్ రాజన్ గారు ఎలా అర్ధం చేసుకున్నారో ఏమో గని, మరుసటి రోజు ఆయనకు కారు వెళ్ళలేదు, అయన స్థానం లో రాధారవి గారిని ఆ క్యారెక్టర్ కు తీసుకొన్నారని తరువాత రాజశేఖర్ గారికి తెలిసింది. ఈ విషయం ఎలా బైట పడింది అంటే మళ్ళీ జీవిత రాజశేఖర్ గారు తలంబ్రాలు షూటింగ్ లో కలుసుకున్నప్పుడు రాజశేఖర్ గారే చెప్పారట, నిన్ను తీసేయమంటే వాళ్ళు నన్నే తీసేసారు అని చెప్పారట..

