ఇటీవల ఆమె ఇన్‌సైడర్ vs అవుట్‌సైడర్ అనే ప్రోగ్రాంలో పాల్గొంది. ఈ సందర్బంగా జాన్వీ మాట్లాడుతూ..బయట వ్యక్తుల కష్టాలు వినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు కానీ ఇండస్ట్రీకి చెందినవారు ఇబ్బందులు పడుతున్నామంటే ఎవరూ పట్టించుకోరు. బయట వ్యక్తులు, ఇండస్ట్రీకి చెందినవారు అని వేరు చేసి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. బయట నుంచి వచ్చినవారితో ఇండస్ట్రీలో వారితో పోల్చడం అన్యాయం.
స్టార్ కిడ్స్ తమ ఇబ్బందులు చెప్పుకుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. వాటిని వినడానికి కూడా ఆసక్తి చూపించరు. అలాగే స్టార్ కిడ్స్ కూడా తాము ఇన్ని కష్టాలు పడ్డామని చెప్పుకోరు. ఎందుకంటే వారికి లభించిన సౌకర్యాలకు కృతజ్ఞతగా ఉంటారు. బయటి వ్యక్తులు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో పోరాటాలు చేయాలి. అది నేను కూడా అంగీకరిస్తాను. ఆ సమస్యలు ఇండస్ట్రీలో ఉండే స్టార్ కిడ్స్ కి అర్థం కావు అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ గా మారాయి..!!