in

janhvi kapoor praises Mrunal Thakur and Nani

తాజాగా నాని నటించిన చిత్రం “హాయ్ నాన్న”. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గతేడాది రిలీజ్ కాగా, థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ సినిమాని తెగ మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది..

ఈ సినిమా గురించి జాన్వి పొగుడుతూ..ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఈ సినిమా నా మనసును తాకింది. ఈ సినిమాలో దర్శకుడు టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే మృనాల్ ఠాకూర్, నాని ఎంతో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. మూవీ టీం అందరికీ ప్రత్యేక శుభాభినందనలు అంటూ జాన్వి తన పోస్ట్ లో భాగంగా రాసుకొచ్చింది. ప్రస్తుతం జాన్వి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన “దేవర” సినిమాలో నటిస్తోంది.!!

a big shock to lady superstar nayanthara!

guntur girl meenakshi gets a chance in ram charan’s next?