in

Janhvi Kapoor Massively Trolled for ignoring a lady fan!

తిలోక సుందరి శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్, అనన్య పాండే, షానాయ కపూర్ ఇటీవల ముంబయిలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. వాళ్లు లోపలికి వెళ్తుంటే.. ఓ అభిమాని వచ్చి జాన్వీ కపూర్ ను సెల్ఫీ అడిగింది. ఈ విషయాన్ని.. పట్టించుకోనట్టుగా.. జాన్వీ ముందుకు వెళ్లిపోయింది. దీంతో.. నెటిజన్లకు తెగ కోపం వచ్చేసింది. జాన్వీ మీద ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఫొటో కోసం వచ్చిన మహిళను అలా పట్టించుకోకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వింతైన కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. బాంద్రాలోని రెస్టారెంట్‌లోకి వెళ్తుండగా.. మహిళ వచ్చి జాన్వీ కపూర్ ను ఫొటో అడిగింది. జాన్వీ వైఖరి నెటిజన్లను నిరాశపరిచింది.

మహిళను పూర్తిగా పట్టించుకోకుండా రెస్టారెంట్ వైపు వెళ్లడంపై మండిపడ్డారు. దీంతో ట్రోల్స్ చేస్తూ.. తెగ ఆడుకుంటున్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి అలా అంటూ.. ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే జాన్వీ కపూర్ కు ట్రోల్స్ కొత్తేమి కాదు.. గతంలోనూ దుస్తుల విషయంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ ఉండే కలర్ డ్రెస్ వేసుకుంది జాన్వీ. ఈ డ్రెస్ లో జాన్వీ చాలా అందంగా ఉంది కానీ ఆ హోలోగ్రఫిక్ డిజైన్ కాపీ అంటూ కొందరు ఫ్యాషన్ ప్రియులు జాన్వీని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

Has heroine Keerthy Suresh Undergone Lip Surgery?

Chandni Bhagwanani at ‘Andamaina Lokam’ Movie Opening!