
తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రియమణి నటి సౌందర్యతో తనకు అఫైర్ ఉండేదని విలక్షణ నటుడు జగపతి బాబు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతూ.. ”అవును సౌందర్యతో నాకు అఫైర్ ఉండేది. ఆమె సోదరుడు నాకు చాలా క్లోజ్. అందుకే వారి ఇంటికి వెళ్లేవాడిని. సౌందర్య మా ఇంటికి తరచుగా వచ్చేది. ఆమె గురించి తప్పుగా అనుకునే వారు కానీ సౌందర్య అలాంటి కాదు. మా బంధాన్ని ప్రజలు ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకునే వారు” అని జగపతి బాబు అన్నారు..అంతేకాకుండా.. ”మా బంధం గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకుంటా. ఆ విషయంలో నేను దాయాల్సింది ఏమీ లేదు. మాపై వచ్చే రూమర్లను నేను కాంప్లిమెంట్‌గా తీసుకుంటా” అని క్లారిటీ ఇచ్చారు జగపతి గారు.

