జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది ” సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన జీవిత సత్యం , దీనికి నిలువెత్తు నిదర్శనం ఇదే పాటలో నటించిన హాస్య నటుడు పద్మనాభం గారి జీవితం. జీవిత సోపాన పటంలో, సర్పం నోట్లో పడి, ఆకాశం నుంచి, పాతాళానికి జారిపోయిన దయ నీయమయిన జీవితం పద్మనాభం గారిది. హాస్య నటుడిగా మూడు దశబ్దాలు ఒక వెలుగు వెలిగిన పద్మనాభం, నటుడిగానే కాక, నిర్మాత గ కూడా ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించి, అపార సంపదను పోగేసిన పద్మనాభం చేసిన ఒక చిన్న తప్పు కారణం గ ఒక్క సారిగా, అధః పాతాళానికి జారిపోయారు. హాస్య నట చక్రవర్తి గ ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో స్నేహితులతో కలసి మందు పార్టీ చేసుకుంటున్న సమయం లో,మద్యం మత్తులో చేసిన ఒక చిన్న సంతకం అయన జీవితాన్ని తలకిందులు చేసింది. స్నేహితులే నమ్మించి ఆయన నిర్మించిన చిత్రాలు హక్కులను 99 ఏళ్లకు లీజ్ కు ఇచ్చినట్లు వ్రాయించుకున్నారు..
బంగారు బాతుల వంటి చిత్రాల మీద ఆ విధంగా హక్కును కోల్పోయిన పద్మనాభం గారు ఆ తరువాత నిర్మించిన” సినిమా వైభవం” అనే చిత్రం అపజయం పాలు కావటం తో ఆర్ధికం గ ఇబ్బందుల పాలయ్యారు. చివరకు అవసరం కోసం తన వెలికి ఉన్న పాతిక లక్షల విలువ చేసే వజ్రపు ఉంగరాన్ని అమ్మ బోయిన ఆయనకు అది నకిలీది అని తెలిసి దిమ్మ తిరిగి, మతి చలించి పోయింది, సొంత కుమారుడు చేసిన మోసం తో కుంగిపోయారు, వయసు మీద పడటం అవకాశాలు లేక పోవటం తో జీవిత చరమాంకం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చివరకు యెన్.టి.ఆర్. చీఫ్ మినిస్టర్ గ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఇల్లు ఏర్పాటు చేసి, ప్రతి నెల పెన్షన్ వచ్చే ఏర్పాటు చెసారు. రేఖ అండ్ మురళి ప్రొడక్షన్ పేరు మీద యెన్.టి.ఆర్. తో దేవత సినిమా నిర్మించినది పద్మనాభం గారే..!!