మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం ఈ నెల 9న జరగబోతోందని గత కొంతకాలంగా విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ముందుగా ఈ న్యూస్ ని ఓ ఆంగ్ల వెబ్ సైట్ ప్రచారం చేసింది. అప్పటి నుంచి జోరుగా ఈ వార్తపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ కాని, అటు లావణ్య త్రిపాఠి నుంచి ఎలాంటి ఖండన రాలేదు. దీంతో ఇది నిజమే అనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ నుంచి కూడా బయటకి వచ్చింది. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే కొంత మంది మెగా అభిమానులు ఇప్పుడు ట్విట్టర్ లో..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ని నిర్ధారిస్తూ పోస్టులు పెట్టారు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. జూన్ 9న ఎంగేజ్మెంట్ జరగబోతోందని, ఇది అఫీషియల్ అంటూ డిక్లేర్ చేశారు. అయితే అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక జరగబోతోందంట. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. నిశ్చితార్ధం అయిన తర్వాత ఫోటోలని బయటకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కలిసి నటించారు..!!