in

it’s official, romantic heroine in vaishnav tej’s next!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డెబ్యూ సినిమా కహోనా ప్యార్ హై సినిమాతో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్ కూడా వైష్ణవ్ తేజ్ బ్రేక్ చేశాడు. ఇక మొదటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టడం కూడా ఓ రికార్డ్. అందుకే ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే క్రేజీ హీరోగా మారిపోయాడు వైష్ణవ్ తేజ్. ఈ నేపథ్యంలో పెద్ద బ్యానర్ నుంచి మెగా మేనల్లుడుకి క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి.

ఆ మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ఒక మూవీ అనౌన్స్ చేశారు..ఈ సినిమాను ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ తో మంచి హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గిరీషయ్య తెరకెక్కిస్తున్నాడు..ఈ సోమవారం నుంచి రెగ్యులర్ గా ప్రారంభించారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ లో చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ జంటగా ‘రొమాంటిక్’ మూవీ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్.

radhika Apte Turns Cosmopolitan Girl!

‘shakunthalam’ will be samantha’s career best : movie unit