ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మీనాక్షి చౌదరి, ఆ తరువాత సినిమాగా ‘ఖిలాడి’ చేసింది. రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి మీనాక్షి చౌదరి మాట్లాడింది. “నా రెండవ సినిమానే రవితేజ గారితో కలిసి చేస్తానని అనుకోలేదు. ఆయన టైమింగ్ మామూలుగా లేదు. తెలుగు అంతగా రాకపోవడం వలన నేను కాస్త ఇబ్బంది పడ్డాను.
కానీ కంగారు పడొద్దంటూ రవితేజ గారు కంఫర్టును ఇచ్చారు. అందువల్లనే నేను నా పాత్రను సరిగ్గా చేయగలిగాను. ఈ సినిమాలో లిప్ లాక్ ఉంది .. కథకు అవసరం కనుకనే అలా చేశాను. డింపుల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆమెకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనే విషయాన్ని నేను గమనించాను. ఈ సినిమా కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేశారు. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తెలుగులో చేసిన ‘హిట్ 2’ .. ‘తమిళంలో చేసిన ‘కొలై’ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి” అని చెప్పుకొచ్చింది.