రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ లో సంచలనాలకు, పబ్లిసిటీ కి కేర్ అఫ్ అడ్రస్, ఎంతో మంది డైరెక్టర్లను, స్టోరీ రైటర్లను, ప్రభావితం చేసిన డైరెక్టర్ ఆర్.జి.వి. తనదంటూ ఒక స్కూల్ అనే స్థాయి లో సినిమా ఇండస్ట్రీ ని ప్రభావితం చేసారు ఆర్.జి.వి. ఈ సుత్తి ఎందుకు ఆర్.జి.వి. ఎంత మొండి సుత్తో మాకు తెలుసు, డైరెక్ట్ గ పాయింట్ కి రా అంటారా, అయితే ఒకే. ఆర్.జి.వి. గారి ప్రభావం సినిమా ఇండస్ట్రీ లోనే కాదు, ఇతర రంగాలకు పాకింది, ఒకే, ఒకే, విషయానికి వచేస్తున్నాను. ఈ మధ్య విజయవాడలో ఒక రెస్టారెంట్ వెలిసింది దాని పేరు “వచ్చి తిని పో ” టాగ్ లైన్ ఏమో ” నాటు రుచులు నీటుగా” చుసిన వాళ్ళందరూ వచ్చి తిని పోతే బిల్లు ఎవరు కడతారు అని నవ్వుకున్నా,
నాటు రుచులు నీటుగా అంటున్నాడు బాబాయ్ ఏంటో చూద్దాం అనుకుంటూ రావటం మొదలై పాపులర్ అయింది. ఒక యు ట్యూబ్ ఫుడ్ ఛానల్ వాళ్ళు ఆ రెస్టారెంట్ ఓనర్ ని కలసి ఇంత తమాషా అయిన పేరు మీకు ఎలా తట్టింది అని అడిగితే, అయన గారు దీనికి బ్యాక్ గ్రౌండ్ రాంగోపాల్ వర్మ అని చెప్పటం విశేషం, పూర్వం ఒక సందర్భం లో ఈ ఓనర్ ని కలిసిన ఆర్. జి,వి. పేర్లు ఎలా పెట్టాలి, పబ్లిసిటీ ఎలా పట్టాలి అనే విషయం లో క్లాస్ పీకారట, ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ పేరు పెట్టాము అని చెప్పారు. వామ్మో! ఆర్.జి.వి. ప్రభావం ఎంత దూరం వెళ్లిందో చూడండి.