in

ismart beauty nidhi agarwal craze in bollywood!

సౌత్ నుంచి మరే హీరోయిన్‌కూ లేని విధంగా ఆమెకు యూట్యూబ్‌లో 100 ప్లస్ మిలియన్ (10 కోట్లు) వ్యూస్ ఉండటం విశేషం. మొదటగా నాగచైతన్యతో చేసిన ‘సవ్యసాచి’ సినిమాతో 100 మిలియన్ వ్యూస్ క్లబ్బులోకి అడుగు పెట్టింది. తెలుగులో డిజాస్టర్ అయిన ఈ మూవీకి ఇప్పటిదాకా హిందీలో 130 మిలియన్ల దాకా వ్యూస్ రావడం విశేషం. ఆ తర్వాత అఖిల్‌తో నిధి చేసిన ‘మిస్టర్ మజ్ను’ సైతం డిజాస్టరే అయినప్పటికీ..

హిందీలో దీనికి 200 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఇక నిధికి తెలుగులో తొలి విజయాన్నందించిన ‘ఇస్మార్ట్ శంకర్’ అయితే ఇంకా అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. ఈ చిత్రం ఇప్పటికే 202 మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో నిధినా మజాకా అంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో నిధి ‘హరిహర వీరమల్లు’ లాంటి భారీ చిత్రంతో పాటు కొత్త హీరో గల్లా అశోక్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

bubbly beauty rashi khanna following samantha!

Rakul Preet Singh on rape case in Manesar: “My blood boils”