in

Is This Prabhas’ Radhe Shyam Story?

ప్రభాస్ ‘రాధే శ్యామ్ సినిమా 80’స్ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని కొందరు అంటుండగా పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని మరి కొందరు చెబుతున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లు రాధ శ్యామ్ అయి ఉంటుందని.. అందుకే టైటిల్ రాధే శ్యామ్ గా పెట్టారని అంతా భావించారు. కానీ ఇటీవల పూజ హెగ్డే బర్త్ డే సందర్భంగా ఆ పాత్ర పేరు ప్రేరణగా పరిచయం చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ పేరు విక్రమాదిత్య గా పరిచయం చేశారు.

హీరో హీరోయిన్ల పేర్లు వేరుగా ఉంటే మరి రాధే శ్యామ్ అని టైటిల్ ఎందుకు పెట్టారనే సందేహం వస్తోంది. దీన్నిబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పునర్జన్మల నేపథ్యంలో సాగే సినిమా అయి ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో విక్రమ్ ఆదిత్య ప్రేరణగా తర్వాతి తరంలో రాధే శ్యామ్ గా పాత్రల పేర్లు ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు తగ్గటే సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు.

Feel The “Beats Of Radhe Shyam”

mamatha mohan das turns into producer!