in

Is Bimbisara Rejected By Raviteja?

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా ‘బింబిసార’ హవా న‌డుస్తుంది. ‘ప‌టాస్’ త‌ర్వాత దాదాపు ఏడేళ్ళ‌కు క‌ళ్యాణ్‌రామ్ ఈ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించాడు. ఈయ‌న‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. కేవ‌లం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దర్శ‌కుడు మ‌ల్లిడి వశిష్ఠ డెబ్యూ సినిమానే అయినా.. త‌న టేకింగ్‌కు, పాత్ర‌ల‌ను మ‌లిచిన విధానంకు సినీ ప్ర‌ముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ముందుగా ఈ క‌థ ఓ స్టార్ హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్ళింద‌ట‌. కానీ ఆయ‌న రిజెక్ట్ చేశాడ‌ట‌..

ఇంత‌కీ ఎవ‌రా? స్టార్ హీరో అనుకుంటున్నారా? ఆయ‌న మ‌రెవ‌రో కాదు మాస్‌రాజా ర‌వితేజ‌. ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ ముందుగా ఈ క‌థ‌ను ర‌వితేజ‌కు చెప్పాడ‌ట‌. అయితే ర‌వితేజ‌కు క‌థ బాగా న‌చ్చింద‌ట‌. కానీ ఆ పాత్ర‌కు త‌ను సూట్ కాన‌ని రిజెక్ట్ చేశాడ‌ట‌. దాంతో ఈ క‌థ క‌ళ్యాణ్‌రామ్ వ‌ద్ద‌కు చేరింద‌ట‌. ముందుగా క‌ళ్యాణ్‌రామ్ కూడా ఈ పాత్ర‌లో త‌ను సూట్ అవుతానో లేదో అని సందిగ్థంలో ప‌డ్డాడ‌ట‌. అయితే బింబిసారి లుక్ టెస్ట్ జ‌రిపి ఆ ఫోటోల‌ను ఎన్‌టీఆర్‌కు పంపాడ‌ట‌. తార‌క్ నుండి మంచి కాంప్లిమెంట్ రావ‌డంతో క‌ళ్యాణ్‌రామ్‌కు ధైర్యం వ‌చ్చింద‌ట‌. ఈ చిత్రంలో క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథ‌రిన్ ట్రెసా, సంయుక్త‌మీన‌న్‌లు న‌టించారు..కీర‌వాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్ప‌టికే 9కోట్ల వ‌ర‌కు ప్రాఫిట్‌ల‌ను ద‌క్కించుకుంది.

rashmika mandanna reveals about her dream roles!

amala paul aims to do only romantic movies next!